గడ్డి కట్టలు కట్టే యంత్రంలో పడి వ్యక్తి మృతి

by Ratna Kumari |

భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగపూర్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది.

గడ్డి కట్టలు కట్టే యంత్రంలో పడి వ్యక్తి మృతి
X

దిశ‌, భీమ‌దేవ‌ర‌ప‌ల్లి : భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగపూర్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రచ్చ సంపత్‌ (48), తండ్రి లక్ష్మయ్య, గడ్డి కట్టలు కట్టే బేలర్‌ మెషిన్‌లో పని చేస్తుండగా.. ప్రమాదవశాత్తు యంత్రంలో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సహాయంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు సాయి కుమార్‌, కుమార్తె జ్యోతి ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story