అతని ఆత్మహత్యకు అదే కారణమా..

by Batti.Sumithra |

వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాక్లుర్ మండలం, మదన్ పల్లి గ్రామంలో జరిగింది.

అతని ఆత్మహత్యకు అదే కారణమా..
X

దిశ, మాక్లుర్ : వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాక్లుర్ మండలం, మదన్ పల్లి గ్రామంలో జరిగింది. స్థానిక ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మదన్ పల్లి గ్రామానికి చెందిన భూపతి మహిపాల్ (40) అదే గ్రామానికి చెందిన భూపతి స్రవంతి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని సమాచారం. దీంతో ఆమె కుటుంబ సభ్యులు భూపతి మహిపాల్ ను పిలిచి గొడవకు దిగడంతో ఆయన మనస్థాపానికి గురయ్యాడు.

శుక్రవారం ఆయన వ్యవసాయ భూమిలోని చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన భార్య భూపతి స్వప్న ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.

Next Story