- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లుడిని నడిరోడ్డుపై నరికి చంపిన మామ.. కూతురు ఆ పని చేసిందనే దారుణం!
తమిళనాడులో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురు భర్తను ఓ తండ్రి కిరాతకంగా హతమార్చిన పరువు హత్య కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురు భర్తను ఓ తండ్రి కిరాతకంగా హతమార్చిన పరువు హత్య కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన శరణ్య, జగన్ అనే యువతియువకులు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో రెండు నెలల క్రితం ఇంట్లో వారికి చెప్పకుండా వెళ్లి ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
దీంతో కూతురు శరణ్య తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని యువతి తండ్రి అల్లుడిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అల్లుడిని హతమార్చాలని నిర్ణయించుకున్న యువతి తండ్రి మంగళవారం తన స్నేహితులతో కలిసి అల్లుడిని నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపాడు. చెన్నైలోని కృష్ణగిరి సమీపంలోని కేఆర్‌పీ డ్యామ్ హైవేపై ఈ సంచలన ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి తండ్రిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు.






