భారీ అగ్నిప్రమాదం.. రూ.2.50 కోట్ల మేర ఆస్తి నష్టం

by Gantepaka Srikanth |

దీపావళి వేళ భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది.

భారీ అగ్నిప్రమాదం.. రూ.2.50 కోట్ల మేర ఆస్తి నష్టం
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి వేళ భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. కర్నూలు పట్టణంలోని తిరుమాళ్ సిల్క్ వస్త్ర దూకాణంలో సోమవారం మధ్యాహ్నం అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షోరూం పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ.2.50 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు షోరూం యజమాని తెలిపారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు. ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపు చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story