- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామాంధుడి కన్ను.. చిన్నారి పై వేధింపులు
సభ్యసమాజం తలదించుకునేలా ఏడో తరగతి చదువుతున్న బాలిక పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు.

దిశ, దమ్మపేట : వరుసకు బంధువయ్యే వ్యక్తి ఆ బాలికకు అండగా ఉండాల్సింది పోయి.. ఆ చిన్నారిపైనే కన్నేశాడు. సభ్యసమాజం తలదించుకునేలా ఏడో తరగతి చదువుతున్న బాలిక పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన దమ్మపేట మండలంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వరుసకు దగ్గరి బంధువయ్యే వ్యక్తి ఆ బాలికను లైంగికంగా వేధిస్తున్నాడని తల్లి తల్లడిల్లిపోయింది. జరిగిన దారుణం పై బాధితురాలి తల్లి వెంటనే దమ్మపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు పరిగణనలోకి తీసుకున్న ఎస్సై సాయి కిషోర్ రెడ్డి నిందితుడి పై కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తును ముమ్మరం చేశారు. మైనర్ల పై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడే మృగాలను విడిచిపెట్టే ప్రసక్తి లేదని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్సై తెలిపారు.






