- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో తీవ్ర విషాదం.. పిడుగుపడి ఇద్దరు బాలురు మృతి
by Kema Shiva Kumar |
రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో పాటు పిడుగులు పడటం కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో పాటు పిడుగులు పడటం కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ పిడుగుపడి ఇద్దరు బాలురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటన మెదక్ (Medak) జిల్లాలోని తూప్రాన్ మునిసిపాలిటీ (Tupran Municipality) పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పడాలపల్లి (Padalapally)లో పిల్లలు క్రికెట్ ఆడుతుండగా.. ఒక్కసారిగా వర్షం వచ్చింది. దీంతో అంతా అక్కడే ఉన్న ఓ చెట్టు కిందకి వెళ్లారు. ఈ క్రమంలోనే అదే చెట్టుపై పిడుగు పడటంతో ఇద్దరు బాలురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






