రాష్ట్రంలో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-15 12:48:18  IST  )

విద్యుదాఘాతంతో తొమ్మిది మందికి తీవ్ర గాయాలైన విషాద ఘటన జగిత్యాల (Jagityal) జిల్లాలో ఇవాళ చోటుచేసుకుంది.

రాష్ట్రంలో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలైన విషాద ఘటన జగిత్యాల (Jagityal) జిల్లాలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోరుట్ల (Korutla) పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న గణేష్ విగ్రహాలు తయారు చేసే షెడ్‌లో క్రేన్ ద్వారా విగ్రహాలు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రేన్ చివరి భాగం ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న హైటెన్షన్ వైర్లను తాకాయి. ప్రమాదంలో కార్మికులు వెళ్లుళ్ల సాయి, అల్వాల వినోద్ ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికులు జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి మరికొందరిని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

Next Story