- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్ బాలిక కిడ్నాప్
నిజామాబాద్ నగరంలో ఓ బాలిక అదృశ్యమైంది.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కేసు నమోదు చేసినట్టు ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తెలిపారు. నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన 15 సంవత్సరాల బాలిక ఈనెల 11న పూసల గల్లీలోని పద్మ టెక్స్టైల్స్ లో పనిచేయడానికి వచ్చి అదృశ్యమైంది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు విచారించగా.. కిడ్నాపర్లు బాలికను బలవంతంగా కిడ్నాప్ చేసినట్టు గుర్తించామని ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తెలిపారు. బాలిక తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాలిక చివరగా మాట్లాడిన ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story






