- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కులాంతర వివాహం.. కడుపుతో ఉన్న కన్న కూతుర్ని హత్య చేసిన తండ్రి
తమ ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి చేసుకుందని ప్రెగ్నెంట్ కూతుర్ని దారుణంగా చంపిన ఘటన కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించడమే కాకుండా ఆతడినే పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. గర్భిణి అని కూడా కనికరం లేకుండా అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కర్ణాటకలోని (Karnataka crime) హుబ్బళ్లిలో (Hubballi murder case) జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మాన్య పాటిల్ (19) అనే అమ్మాయి అదే గ్రామానికి చెందిన మరో సామాజిక వర్గానికి (Inter-caste marriage) చెందిన వ్యక్తిని ప్రేమించి ఈ ఏడాది మేలో పెళ్లి చేసుకుంది. తన తల్లిదండ్రులకు ఇష్టానికి విరుద్ధంగా ఈ పెళ్లి చేసుకున్నందునా తన కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని భయపడిన మాన్య పాటిల్ గ్రామానికి100 కిలోమీటర్ల దూరంలో హవేరి జిల్లాలో తన భర్తతో నివసిస్తోంది. పరిస్థితి అంతా సద్దుమణిగింది అనుకుని ఇటీవలే ఆమె తన స్వగ్రామానికి తిరిగి వచ్చింది.
అయితే తన కూతురు విషయంలో లోలోపల రగిలిపోతున్న మాన్య తండ్రి ప్రకాశ్ ఫక్కిర్ గోడా ఆదివారం సాయంత్రం కూతురు భర్త కుటుంబంపై ఇనుప పైపులు ఇతర ఆయుధాలతో దాడికి దిగాడు. ఇంట్లోకి చొరబడి అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఆరు నెలల గర్భవతి అయిన మాన్యను రక్షించేందుకు ఆమె అత్తమామలు ప్రయత్నించినా విఫలమయ్యారు. తీవ్ర గాయాలతో మాన్య ప్రాణాలు కోల్పోయింది. ఆమె అత్తమామలకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. తండ్రికి భయపడి గ్రామానికి దూరంగా ఉన్న కూతురు చివరకు అదే తండ్రి చేతిలో చనిపోవడం గ్రామంలో విషాదం నింపింది. ఇక నిండు గర్భిణి అనే కనికరం లేకుండా వ్యవహరించిన తీరు అందరిని కలిచి వేసింది. ఈ ఘనటలో పోలీసులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు.






