- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. ఇద్దరు మహిళలను హత్య చేసి.. పందులకు ఆహారంగా వేసిన రైతు..
దక్షిణాఫ్రికాలో రేసిజమ్ ఎక్కువగా ఉంటుంది. నల్లజాతీయులను అంటరాని వారుగా చూస్తారు శ్వేతజాతీయులు. ఈ క్రమంలో కొన్నిసార్లు ముట్టుకున్నా సరే దారుణంగా దాడులు చేస్తారు. ఇలాంటి కోవలోకి చెందిందే ఈ ఘటన.

దిశ, వెబ్ డెస్క్ : దక్షిణాఫ్రికాలో రేసిజమ్ ఎక్కువగా ఉంటుంది. నల్లజాతీయులను అంటరాని వారుగా చూస్తారు శ్వేతజాతీయులు. ఈ క్రమంలో కొన్నిసార్లు ముట్టుకున్నా సరే దారుణంగా దాడులు చేస్తారు. ఇలాంటి కోవలోకి చెందిందే ఈ ఘటన. లింపోపోలోని పోలోక్వానే సమీపంలోని సెబాయెంగ్‌లో ఓ శ్వేతజాతీయ రైతుకు చెందిన ఫామ్ ఉంది. అయితే అందులో మిగిలిన ఆహారాన్ని తెచ్చుకునేందుకు వెళ్లారు ముగ్గురు నల్లజాతీయులు. దీంతో కోపోద్రిక్తుడైన రైతు.. కాల్పులు జరపగా.. ఇద్దరు మహిళలు మక్గాటో, లూసియా ఎన్‌డ్లోవు అక్కడికక్కడే మృతి చెందగా.. ఎన్‌డ్లోవు భర్త తప్పించుకున్నాడు.
దీంతో రైతు జోహానెస్ ఒలివియర్, తన ఉద్యోగి విలియం ముసోరాతో కలిసి శవాలను మాయం చేసే ప్రయత్నం చేశాడు. మృతదేహాలను పందులకు ఆహారంగా వేశాడు. ఎన్‌డ్లోవు భర్త ఫిర్యాదుతో కేసు నమోదు కాగా మర్డర్, అటెంప్ట్ మర్డర్, అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్నాడని రైతుపై కేసు నమోదైంది. పోలోక్వానే హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా.. నిందితులకు ఉరిశిక్ష విధించాలని, వెంటనే ఫామ్ మూసివేయాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ కేసు అక్టోబర్ 6వ తేదీకి వాయిదా పడింది.






