- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో సంచలనం.. రైతు దారుణ హత్య.. పక్కింట్లోని పెట్టేలో ముక్కలు ముక్కలుగా నరికిన మృతదేహం
యూపీ ఎటాహ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రైతును హత్య చేసి బాక్స్‌లో పెట్టిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. మలవాన్ పట్టణానికి చెందిన 50ఏళ్ల రైతు జఝూర్ సింగ్.. ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లాడు. లేట్ నైట్ అయినా రాకపోవడంతో భర్త కోసం వెతికిన భార్య

దిశ, వెబ్ డెస్క్ : యూపీ ఎటాహ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రైతును హత్య చేసి బాక్స్‌లో పెట్టిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. మలవాన్ పట్టణానికి చెందిన 50ఏళ్ల రైతు జఝూర్ సింగ్.. ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లాడు. లేట్ నైట్ అయినా రాకపోవడంతో భర్త కోసం వెతికిన భార్య.. చివరకు మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది. దీంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు.. రైతు సెల్ ఫోన్ ట్రాక్ చేశారు. సిగ్నల్ ఆయన ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఇంద్రపాల్ సింగ్ అనే ఇంటి దగ్గర చూపించింది. దీంతో అతని ఇంటిని తనిఖీ చేయగా.. ఓ పెట్టెలో ముక్కలు ముక్కలుగా నరికిన మృతదేహం కనిపించింది. వ్యక్తిగత వివాదంతోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. ఫోరెన్సిక్ బృందం సహాయంతో ఆధారాలు సేకరించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా ఇంద్రపాల్, అతని కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉన్నారు.






