- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళతో ఎఫైర్.. ప్రేయసి కోసం కిల్లర్‌గా మారిన ప్రముఖ జోతిష్యుడు
వివాహితతో అక్రమసంబంధం పెట్టుకున్న ఓ జోతిష్యుడు ఆమె కోసం చివరకు కిల్లర్ గా మారాడు. వివాహిత భర్తను లేపేస్తే తనకు అడ్డు ఉండదని భావించాడో ఏమో కానీ శిష్యులతో కలిసి దాడి చేయగా బాధితుడు తప్పించుకున్నప్పటికీ అతడి స్నేహితుడు బలయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్: వివాహితతో అక్రమసంబంధం పెట్టుకున్న ఓ జ్యోతిష్కుడు ఆమె కోసం చివరికు కిల్లర్‌గా మారాడు. వివాహిత భర్తను లేపేస్తే తనకు అడ్డు ఉండదని భావించాడో ఏమో కాని శిష్యులతో కలిసి దాడి చేయగా బాధితుడు తప్పించుకున్నప్పటికీ అతడి స్నేహితుడు బలయ్యాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కమలాకర్ భట్ అనే జ్యోతిష్కుడు కర్ణాటకలో చాలా ఫేమస్. కాగా అతడికి అవరగుప్పె గ్రామానికి చెందిన సుచిత్ర అనే వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొంతకాలానికి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
అయితే సుచిత్రకు 20ఏళ్ల క్రితమే మహేశ్ నాయక్ అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరగ్గా వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉంది. తల్లి కమలాకర్‌తో సన్నిహితంగా ఉంటుందనే విషయాన్ని కూతురు మహేశ్ నాయక్‌కు చెప్పడంతో అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. భార్యను మందలించాడు. దీంతో తండ్రికి ఎందుకు చెప్పావ్ అంటూ సుచిత్ర కుమార్తెను కొద్దింది. ఈ క్రమంలో ఇంట్లో గొడవలు పెరగటంతో మహేశ్ నాయక్ తన స్నేహితుడు వసంత్ నాయక్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తుండగా కమలాకర్ తన శిష్యులతో కలిసి దాడి చేశాడు.
దాడిలో మహేశ్ నాయక్ తో పాటు అతడి స్నేహితుడు సైతం గాయపడ్డారు. అయితే మహేశ్ నాయక్ ప్రాణాలతో బయటపడగా వసంత్ నాయక్ కన్నుమూశాడు. ఈ దాడిలో మహేశ్ నాయక్ భార్య సుచిత్ర, ఆమె తండ్రి లోకనాథ, కమలాకర్ భట్ తో పాటు మరికొందరు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే జ్యోతిష్కుడు కమలాకర్ భట్ ను అరెస్ట్ చేయడంతో పాటు మరో ఆరుగురిని సైతం అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆరు నెలలుగా సుచిత్ర కమలాకర్ తో సన్నిహితంగా ఉండగా అప్పటి నుండి ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టు విచారణలో తేలింది.






