కన్నతల్లిని కిరాతకంగా చంపి వాసన రాకుండా 200 పర్‌ఫ్యూమ్స్ వాడిన కూమార్తె

by Disha Web Desk 7 |
కన్నతల్లిని కిరాతకంగా చంపి వాసన రాకుండా 200 పర్‌ఫ్యూమ్స్ వాడిన కూమార్తె
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నతల్లిని దారుణంగా చంపి మృతదేహాన్ని రెండు నెలలుగా ఇంట్లోనే దాచింది ఓ కూతురు. డిసెంబర్‌లో హత్య చేసినా.. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘోర ఘటన ముంబైలో జరిగింది. లాల్‌బాగ్ ప్రాంతంలోని ఇబ్రహీం కసమ్ అపార్ట్మెంట్‌లో తల్లీకుమార్తెలైన వీణాజైన్ (55), రింపుల్ ప్రకాశ్ జైన్(22) కొన్నేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. అయితే వీణాజైన్‌ రెండు నెలల నుంచి కనిపించకపోవడంతో ఇంటి చుట్టుపక్కల వాళ్లు ఆమె సోదరుడికి సమాచారం ఇచ్చారు. అనుమానం వచ్చిన అతడు కాలాచౌకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వీణాజైన్ నివాసం ఉంటున్న ప్లాట్‌కు వెళ్లి చూడగా... ఆమె శరీర భాగాలు ముక్కలుగా చేసి ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి.. తల, మొండెం బీరువాలో, కాళ్లు, చేతులు స్టీల్ వాటర్ క్యాన్‌లో దాచారు. అవి కుళ్లిపోయి ఉండటంతో పాటు వస్తువులన్ని ఇంట్లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పోలీసులు మృతురాలి శరీర భాగాలను స్వాధీనం చేసుకుని, శరీర భాగాల్ని పోస్ట్‌మార్టంకు పంపించారు.

ఆ తరవాత ఇరుగుపొరుగు వారిని వీణాజైన్, ఆమె కూమార్తె రింపుల్ జైన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూతురు రింపుల్ ప్రకాశ్ జైన్‌ ప్రవర్తన తేడాగా ఉండటంతో పోలీసులు ఆమెను ప్రశ్నించారు. తన తల్లి ఎలా చనిపోయిందని ప్రశ్నించగా... 2 నెలల క్రితం మొదటి అంతస్తు నుంచి కిందపడితే ఎవరో ఇద్దరు ఇంట్లోకి తీసుకొచ్చి పడేసి వెళ్లిపోయారని, భయంతో ఎవరికి చెప్పలేదని పొంతనలేని సమాధానం చెప్పింది. తల్లి వీణా జైన్ హత్యకు కారణం రింపుల్ ప్రకాష్ జైనే అయి ఉంటుందని పోలీసులు ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహం కుళ్లిన వాసన రాకుండా ఉండేందుకు రింపుల్ ప్రకాశ్ జైన్ 200 రకాల ఎయిర్‌ఫ్రెషనర్ స్ర్పేలు, పర్‌ఫ్యూమ్స్ తీసుకొచ్చి శరీర భాగాలపై పూసిందని విచారణలో తేలింది. గత సంవత్సరం డిసెంబరులో ఈ హత్య జరిగినట్లు గుర్తించారు. రింపుల్ ప్రకాశ్‌పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 302, ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కన్నతల్లిని ఇంత కిరాతకంగా హత్యచేయడానికి గల కారణం ఆమె మానసికి పరిస్థితా? లేక ప్రేమ వ్యవహారమా? ఇంకా వేరే కారణం ఏమైనా ఉందా అని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.


Next Story

Most Viewed