- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తను ముక్కలు ముక్కలుగా నరికి.. గ్రైండర్‌లో రుబ్బి.. కాలువలో పారేసిన కిరాతక భార్య!
ఉత్తరప్రదేశ్‌లోని శంభల్ జిల్లాలో వెలుగుచూసిన ఓ అతి కిరాతక హత్య ఉదంతం సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని శంభల్ జిల్లాలో వెలుగుచూసిన ఓ అతి కిరాతక హత్య ఉదంతం సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తుంది. కేవలం వివాహేతర సంబంధానికి (extramarital affair) అడ్డుగా ఉన్నాడన్న నెపంతో, రాహుల్ అనే వ్యక్తిని అతని భార్య రూబీ (Wife Ruby) తన ప్రియుడు గౌరవ్‌తో కలిసి నవంబర్ 18న అత్యంత పాశవికంగా హతమార్చింది. కేవలం ప్రాణాలు తీయడంతో ఆగకుండా, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, ఆ మాంసాన్ని గ్రైండర్‌లో వేసి రుబ్బి కాల్వలో పారేయడం నిందితుల వికృత మనస్తత్వానికి అద్దం పడుతోంది. నేరం చేసిన తర్వాత ఏమీ తెలియనట్టు భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన రూబీ.. చివరికి భర్త చేతిపై ఉన్న 'టాటూ' రూపంలో దొరికిపోయింది.
ఈ ఘటన గతంలో దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ‘శ్రద్ధా వాకర్’, ‘అంజన్ దాస్’ హత్యోదంతాలను గుర్తుకు తెస్తోంది. ఢిల్లీలో శ్రద్ధా వాకర్‌ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన ఘటన, అలాగే పాండవ్ నగర్‌లో భర్తను చంపి ముక్కలుగా కోసి పారేసిన భార్య ఉదంతం తరహాలోనే ఈ ‘శంభల్’ కేసు సాగింది. టెక్నాలజీ మరియు ఆధునిక దర్యాప్తు పద్ధతులు అందుబాటులో ఉన్నా, నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిందితులు ఇలాంటి అత్యంత కిరాతక మార్గాలను ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రేమ, పెళ్లి వంటి పవిత్ర బంధాలను కాలరాస్తూ కేవలం క్షణిక వాంఛల కోసం కన్నవారిని, కట్టుకున్న వారిని కడతేరుస్తున్న ఇటువంటి ఘటనలు సమాజంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తున్నాయి. గతంలో జరిగిన ఇలాంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడినప్పటికీ, నేరస్తుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు రూబీ, ఆమె ప్రియుడు గౌరవ్‌ను అరెస్ట్ చేసి కఠిన విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో త్వరలోనే మరిన్ని భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.






