- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటి సంపులో పడి చిన్నారి మృతి
దిశ, అచ్చంపేట : నూతన సంవత్సరం వేళ.. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

దిశ, అచ్చంపేట : నూతన సంవత్సరం వేళ.. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నూతన సంవత్సరం రోజు విషాద గాథలు ఎక్కువగా చోటు చేసుకోవడం గమనార్హం. కల్వకుర్తిలో అన్నంలో పురుగుల మందు కలిపి కొడుకు, కూతురుకి తినిపించింది తల్లి. ఆ తరువాత ఆ తల్లి కూడా తినడంతో తల్లి, కూతురు మరణించారు. కొడుకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఇలా ఉంటే.. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. అమ్రాబాద్ మండల పరిధిలో నీటి సంపులో పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన జంగంరెడ్డి పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మండారి రాణి, సైదులు దంపతులకు ఇద్దరు కుమారులు. ఒక కూతురు. తల్లి ఇంటి పనిలో నిమగ్నమై ఉండగా.. తండ్రి పని మీద బయటికి వెళ్లాడు. రెండున్నరేళ్ల చిన్నారి జానశ్రీ ఆడుకుంటూ ఇంటి ముందు ఉన్న నీటి సంపు గుంతలో పడింది. దీంతో ఎవ్వరూ గుర్తించలేదు. నీటి సంపులో పడిన తరువాత ఆలస్యంగా తల్లి పాప కనిపించకపోవడంతో వెతికింది. దీంతో నీటి సంపులో పడిన విషయం గమనించి స్థానికుల సహాయంతో చిన్నారిని బయటికి తీశారు.అంబులెన్స్ లో అచ్చంపేటకు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో నూతన సంవత్సరం వేళ.. ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.






