చికెన్ పెట్టిన చిచ్చు.. కత్తితో పొడిచి దారుణ హత్య!

by Chintha Aamani |

సమాజంలో హత్యల పరంపర కొనసాగుతూ వస్తుంది.

చికెన్ పెట్టిన చిచ్చు.. కత్తితో పొడిచి దారుణ హత్య!
X

దిశ,వెబ్ డెస్క్ : సమాజంలో హత్యల పరంపర కొనసాగుతూ వస్తుంది. కారణం ఏదైనా ముందు హత్య చేయడానికే మొగ్గుచూపుతున్నారు. అకారణల చేత క్షణికావేశంలో చేసినవి కొన్ని ఉంటే పక్కా ప్లాన్ ప్రకారం చేసినవి మరొన్నిఉంటున్నాయి. బంధం,బంధుత్వంతో సంబంధం లేకుండా బలి చేస్తున్నారు. అయితే విందులో చికెన్ తక్కువ వేశాడని స్నేహితుడిని పోడిచి చంపిన ఘటన కర్ణాటకలో కలకలం సృష్టించింది.

కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన అభిషేక్ కి ఇటీవల కాలంలోనే పెళ్లి అయింది. పెళ్లి అయిన సందర్భంగా స్నేహితులకు పార్టీ ఇద్దాం అనుకుని ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో చికెన్ విషయంపై వాగ్వాదం జరిగింది. అది కాస్త హత్యకు దారితీసింది. అభిషేక్ తనకు చికెన్ తక్కువ వేశాడని విట్టల్ అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమై అభిషేక్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, విట్టల్‌ను అరెస్టు చేసినట్లు సమాచారం. దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story