డివైడ‌ర్ ని ఢీ కొట్టిన కారు.. మ‌రో యువ‌కుడు మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ, సత్తుపల్లి : డిసెంబ‌ర్ 03న తెల్లవారుజామున డివైడర్ ను ఢీ కొట్టిన‌ కారు ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు యువకులు మృతి చెందగా.. ఆసుపత్రిలో మరో ఇద్దరు చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే.

డివైడ‌ర్ ని ఢీ కొట్టిన కారు.. మ‌రో యువ‌కుడు మృతి
X

దిశ, సత్తుపల్లి : డిసెంబ‌ర్ 03న తెల్లవారుజామున డివైడర్ ను ఢీ కొట్టిన‌ కారు ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు యువకులు మృతి చెందగా.. ఆసుపత్రిలో మరో ఇద్దరు చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సత్తుపల్లి లో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 3 తేదీ బుధవారం తెల్లవారుజామున చండ్రుగొండ నుంచి పెనుబల్లి మండలం మీదుగా సత్తుపల్లి వైపు వస్తున్న కారు కిష్టారం, అంబేద్కర్ నగర్ సమీపంలో డివైడర్ ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు యువకులు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావటంతో సత్తుపల్లి ఆసుపత్రికి, అక్కడ నుంచి ఖమ్మం మమత ఆసుపత్రికి తరలించగా తీవ్రంగా గాయపడిన తలారి అజయ్ (21) ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. దీంతో కారు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. మరో యువకుడు షేక్ ఇమ్రాన్ చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అజయ్ నాన్న రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా.. చెల్లి వికలాంగురాలు కావడంతోపాటు కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న కుమారుడు అజయ్ మృతి చెందడంతో తల్లి, బంధువులు, కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.. దీంతో అన్నపురెడ్డిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story