- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటోను ఢీకొన్న కారు..చికిత్స పొందుతూ తండ్రి, కొడుకు మృతి
by Ratna Kumari |
కారు ఆటోను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన తండ్రి, కొడుకు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, యాచారం : కారు ఆటోను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన తండ్రి, కొడుకు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నందీశ్వర్ రెడ్డి, తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గుల, మండలం నాగిళ్ల గ్రామం, కుర్ర తండాకు చెందిన కొర్రా జాను (47) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని కుమారుడు కొర్రా నర్షా (39) తో హైదరాబాద్ నుంచి ఆటోలో బయలుదేరి స్వగ్రామానికి వెళుతుండగా యాచారం మండల కేంద్రంలోని డీఆర్ఎస్ గార్డెన్ వద్దకు చేరుకోగానే అతివేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొనడంతో తండ్రి కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు చికిత్స కోసం నగరంలోని మహోనియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






