యువకుడి దారుణ హత్య

by Ratna Kumari |

దిశ‌, న‌వాబుపేట : యువ‌కుడిని దారుణ హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై విక్ర‌మ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని య‌న్మ‌న్ గండ్ల గేట్ స‌మీపంలో గురువారం సాయంత్రం ఓ

యువకుడి దారుణ హత్య
X

దిశ‌, న‌వాబుపేట : యువ‌కుడిని దారుణ హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై విక్ర‌మ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని య‌న్మ‌న్ గండ్ల గేట్ స‌మీపంలో గురువారం సాయంత్రం ఓ యువ‌కుడిని గుర్తు తెలియ‌ని వ్యక్తులు దారుణంగా హ‌త‌మార్చారు. యువ‌కుడిని ఎక్క‌డో చంపి అక్క‌డి నుంచి మృతదేహాన్ని య‌న్మ‌న్ గండ్ల స్టేజీ స‌మీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చారు. అక్క‌డ మృతదేహం పై నిప్పు అంటించి అక్క‌డి నుంచి దుండ‌గులు ప‌రార‌య్యారు. యువకుడి శరీరం మొత్తం కాలిపోవడంతో అతడిని గుర్తించడం కష్టంగా మారింది. ఈ ఘ‌ట‌న‌ గురించి సమాచారం అందిన వెంటనే ఎస్సై విక్రమ్ అక్కడి చేరుకొని మృతదేహాన్ని, సంఘటన స్థలం పరిసరాలను పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. ఉన్న‌తాధికారుల ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ విక్ర‌మ్ " దిశ " కు వెల్ల‌డించారు.

Next Story