హైదరాబాద్‌లో దారుణం.. కూతురు డెలివరీ కోసం వచ్చి తండ్రి మృతి

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌(Hyderabad)లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లో దారుణం.. కూతురు డెలివరీ కోసం వచ్చి తండ్రి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కూతురు డెలివరీ కోసం వచ్చి తండ్రి(Father Dead) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ – చైతన్యపురిలో నివాసమంటున్న తన కూతురు డెలివరీ కోసం వరంగల్ నుండి తండ్రి చెకిలన్ గోపాల్(62) హైదరాబాద్ వచ్చారు. ఎల్‌బీనగర్ ప్రాంతంలోని ఆసుపత్రి వద్ద టిఫిన్ చేసి వస్తుండగా, గోపాల్‌ను గుర్తుతెలియని స్కూటీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన గోపాల్ అక్కడికక్కడే మృతిచెందారు. స్కూటీ నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గోపాల్ అల్లుడు చరణ్ సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story