భద్రాద్రిలో దారుణం.. నడిరోడ్డుపై కత్తులతో పొడిచి హత్య చేసిన యువకులు

by Taduka Kalyani |

భద్రాచలం పట్టణంలో పట్టపగలే ఒక వ్యక్తిని కొందరు యువకులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసిన సంఘటన నివ్వెరపరిచింది

భద్రాద్రిలో దారుణం.. నడిరోడ్డుపై కత్తులతో పొడిచి హత్య చేసిన యువకులు
X

దిశ, భద్రాచలం : భద్రాచలం పట్టణంలో పట్టపగలే ఒక వ్యక్తిని కొందరు యువకులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసిన సంఘటన నివ్వెరపరిచింది. చర్ల రోడ్ లోని వైన్స్ షాప్స్ సమీపంలో కొందరు యువకులు ప్రధాన రహదారిపై, ప్రజలు చూస్తుండగా రవి వర్మ అనే వ్యక్తి పై కత్తులతో పొడిచి చంపారు. దాడి చేసిన అనంతరం సంఘటన స్థలం నుంచి ధైర్యంగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. అక్కడే ఉన్న కొందరు రవి వర్మను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story