- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడి దారుణ హత్య
హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. అర్ధరాత్రి రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతూ.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి తాగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని సర్దార్ పటేల్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి గంజాయి మత్తులో జోగుతూ.. కొందరు యువకులు కాలనీలో వీరంగం సృష్టించారు. ఈ క్రమంలోనే గొడవ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించిన యువకుడు వెంకటరమణపై పవన్ అతడి గ్యాంగ్ మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అనంతరం వారు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ దాడిలో వెంకటరమణకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల మాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.






