13 ఏళ్ల బాలుడిపై టీచర్ అత్యాచారం..

by Disha Web |
13 ఏళ్ల బాలుడిపై టీచర్ అత్యాచారం..
X

దిశ, వెబ్ డెస్క్: ఇప్పుడున్న సమాజంలో మహిళలే కాదు.. బాలురు కూడా లైంగిక దాడులకు గురవుతున్నారు. కామాంధులు తమ కోరికలు తీర్చుకునేందుకు ఆడ, మగ, జంతువు అని కూడా చూడకుండా వ్యవహరిస్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనలను వార్తల్లో చూస్తునే ఉన్నాం. తాజాగా, ఘజియాబాద్‌లో 13 ఏళ్ల బాలుడిపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఘజియాబాద్‌లోని మదర్సాలో బాగ్‌పత్ జిల్లాకు చెందిన మమూన్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఖురాన్ నేర్పడానికి ఐదు నెలల క్రితం 13 ఏళ్ల బాలుడిని మదర్సాకు తీసుకువచ్చాడు. అయితే ఓ రోజు ఆ ఉపాధ్యాయుడు బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి నుండి బాలుడు తప్పించుకుని ఓ వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకుని తన తండ్రికి కాల్ చేసి జరిగిన ఘోరాన్ని వివరించాడు. వెంటనే తండ్రి బాలుడిని తీసుకోని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉపాధ్యాయుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాలుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు నిందితుడిపై IPC సెక్షన్ 377, ఫొక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాలుడిని వైద్య పరీక్షలకు పంపించారు. పరారీలో ఉన్న ఉపాధ్యాయుడి ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.Next Story