- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర విషాదం.. దుర్గ మాత విగ్రహంతో పాటు కొట్టుకుపోయిన 9 మంది
by Malleboina Mahesh |
నవరాత్రుల అనంతరం నిమజ్జనం కార్యక్రమంలో తీవ్ర విషాదం నెలకొంది

X
దిశ, వెబ్ డెస్క్: నవరాత్రుల అనంతరం నిమజ్జనం కార్యక్రమంలో తీవ్ర విషాదం నెలకొంది. అమ్మవారి విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేస్తున్న సమయంలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 9 మంది విగ్రహంతో పాటు నదిలో కొట్టుకుపోయారు. ఈ విషాద సంఘటన యూపీలోని ఆగ్రా సమీపంలో ఉన్న దుంగర్వాల గ్రామంలోని ఉతంగన్ నదిలో లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి ఒక్కసారిగా పెరిగిన వరద ప్రవాహం కారణం అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఒకరిని ప్రాణాలతో కాపాడారు. అలాగే మరో ముగ్గురు అప్పటికే ప్రాణాలు కోల్పోగా వారి మృత దేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గల్లంతవ్వగా రెస్క్యూ సిబ్బంది వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తుంది.
Next Story






