- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హనీ ట్రాప్‌లో 81 ఏళ్ల వృద్ధుడు.. కట్ చేస్తే అకౌంట్‌లో రూ.7 లక్షలు స్వాహా
రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber criminals) పంజా విసురుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber criminals) పంజా విసురుతున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్యాష్ పేమెంట్స్ నిలిచిపోయి, ఆన్‌లైన్ పేమెంట్స్ కొనసాగుతుండటంతో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో సైబర్ నేరగాళ్లు ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. క్యూఆర్ కోడ్స్, లింకులతో జనాల వద్ద ఉన్న సొమ్మును దర్జాగా కాజేస్తూ.. హాయిగా చెక్కేస్తున్నారు.
ఈ క్రమంలోనే 81 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు హనీ ట్రాప్ (Honey Trap)లో పడేసిన ఘటన నగర పరిధిలోని అమీర్‌పేట్ (Ameerpet)లో చోటుచేసుకుంది. వివరాల్లో్కి వెళితే.. జూన్ మొదటి వారంలో వృద్ధుడికి మాయా రాజ్‌పుత్ అనే పేరుతో మొబైల్ కాల్స్, మెసేజ్‌లు రావడం వచ్చాయి. అయితే, చనువుగా మాట్లాడుతూ.. సైబర్ కేటుగాళ్లు ఆ వృద్ధుడిని ట్రాప్ చేశారు. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తూ అతడి బ్యాంక్ అకౌంట్ నుంచి విడతల వారీగా రూ.7.11 లక్షలు కాజేశారు. డబ్బులన్నీ గుల్లా అయ్యాక తాను మోసపోయానని గ్రహించిన వృద్ధుడు అమీర్‌పేట్ పోలీసులను ఆశ్రయించగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






