- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
75ఏళ్ల వృద్ధుడి కామవాంఛకు బలి.. ఐదు నెలల గర్భంతో బాలిక
ఆడ పిల్లలకు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతున్న సంఘటనలు చూస్తున్నాం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మంచివారిగా నటిస్తూనే పిల్లలను తమ కామవాంఛకు బలి తీసుకుంటున్న ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటిదే తాజాగా

దిశ, వెబ్ డెస్క్ : ఆడ పిల్లలకు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతున్న సంఘటనలు చూస్తున్నాం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మంచివారిగా నటిస్తూనే పిల్లలను తమ కామవాంఛకు బలి తీసుకుంటున్న ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటిదే తాజాగా యూపీలోని ఔరెయాలో చోటు చేసుకుంది. స్నేహితుడి కూతురిని తన బిడ్డలా చూడాల్సిన వ్యక్తి.. తన కామానికి బలి తీసుకున్నాడు. మైనర్ బాలికను పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బయట చర్చిస్తే తనను బ్యాడ్ చేస్తానని హెచ్చరించాడు. దీంతో అమ్మాయి సైలెంట్‌గా ఉంది. కానీ ఐదు నెలల తర్వాత పాపకు కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. పరీక్షలు చేసి చూస్తే ఫలితాల్లో ఆమె ఐదు నెలల గర్భంతో ఉందని తేలింది. పాపను ప్రశ్నించగా.. గ్రామానికి చెందిన 75ఏళ్ల వృద్ధుడు, నాన్న స్నేహితుడైన బిషంబర్ దయాళ్ తనపై అత్యాచారం చేశాడని, విషయాన్ని బయటకు చెప్పకూడదని బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పింది. దీంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. నిందితుడిని అరెస్ట్ చేశారు.






