- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీరతో కట్టిన ఉయ్యాలే.. చిన్నారిపాలిట ఉరితాడైంది
by Naga Rani Yarlagadda |
ఇంటి వరండాలో చీరతో కట్టిన ఉయ్యాలే చిన్నారి ప్రాణం బలిగొంది. ఉయ్యాలతో ఆడుకుంటుండగా అది మెడకు చుట్టుకుపోయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: చీరతో కట్టిన ఉయ్యాలే ఆ చిన్నారి పాలిట యమపాశమైంది. ఉయ్యాలలో ఆడుకుంటున్న ఏడేళ్ల పాప మెడకు ఉయ్యాల చీర బిగుసుకుపోవడంతో ఊపిరందలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం టౌన్ పీఎస్ పరిధిలో ఉన్న ఇందిరమ్మ కాలనీలో చేబ్రోలు జయ కుమార్ వృత్తి రీత్యా ఆటోడ్రైవర్. కూతురు సునంద భాగ్యలక్ష్మి (7) మంగళవారం రాత్రి ఇంటి ఆవరణలో పిల్లల కోసం చీరతో కట్టిన ఉయ్యాల్లో ఊగుతూ ఆడుకుంటూ ఉంది. ఈ క్రమంలో ఉయ్యాల ఆమె మెడకు చుట్టుకుపోయి ఊపిరాడలేదు. పక్కింటి, ఎదురింటివాళ్లు గమనించి.. వెంటనే చీరను విప్పి సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే సునంద మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






