52 ఏళ్ల వయసు.. తొమ్మిది మంది పిల్లలకు తల్లి.. కానీ 20ఏళ్ల కుర్రాడితో పారిపోయి.. పిల్లను కూడా..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లా ఖేడా జలాల్పూర్ విలేజ్‌లో వింత కేసు వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నీలమ్‌కు 52 ఏళ్ల వయసు.. తొమ్మిది మంది పిల్లలు.. ఎన్ని బాధ్యతలు ఉంటాయి.. ఎన్ని పనులు చేయాలి.. ఈ ఆలోచనలతోనే

52 ఏళ్ల వయసు.. తొమ్మిది మంది పిల్లలకు తల్లి.. కానీ 20ఏళ్ల కుర్రాడితో పారిపోయి.. పిల్లను కూడా..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లా ఖేడా జలాల్పూర్ విలేజ్‌లో వింత కేసు వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నీలమ్‌కు 52 ఏళ్ల వయసు.. తొమ్మిది మంది పిల్లలు.. ఎన్ని బాధ్యతలు ఉంటాయి.. ఎన్ని పనులు చేయాలి.. ఈ ఆలోచనలతోనే జీవితం గడుస్తుంది. కానీ ఈవిడ మాత్రం తన రూటే సపరేట్ అంటూ.. 20 ఏళ్ల కుర్రాడు పప్పు యాదవ్‌తో పారిపోయింది. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య ఇల్లీగల్ ఎఫైర్ నడుస్తుండగా... ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఆమెతో పాటు పదేళ్ల వయసున్న చిన్నకూతురును కూడా తీసుకుని వెళ్లింది. ఈ ఘటనతో కుటుంబీకులు షాక్ అయ్యారు. నీలమ్ ఇలా చేస్తుందనుకోలేదని భర్త, పిల్లలు బాధపడుతున్నారు. తమ పరువు తీసిందని కన్నీరు పెట్టుకుంటున్నారు. పైగా ఆమెతోపాటు చిన్నారిని తీసుకెళ్లడంపై మరింత భయపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.

Next Story