- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
45ఏళ్లు.. ఐదుగురు పిల్లలకు తండ్రి.. కానీ పదిహేనేళ్ల పాపతో లవ్.. చివరకు..
ఉత్తరప్రదేశ్ షమ్లీ జిల్లాలో వింత లవ్ స్టోరీ విషాదంతో ఎండ్ అయిపోయింది. బబ్రీ గ్రామానికి చెందిన 45ఏళ్ల దేశ్‌పాల్‌కు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. మరోవైపు అదే గ్రామానికి చెందిన పదిహేనేళ్ల అమ్మాయి, దేశ్‌పాల్ ఒకరి మీద ఒకరు మనసు పారేసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ షమ్లీ జిల్లాలో వింత లవ్ స్టోరీ విషాదంతో ఎండ్ అయిపోయింది. బబ్రీ గ్రామానికి చెందిన 45ఏళ్ల దేశ్‌పాల్‌కు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. మరోవైపు అదే గ్రామానికి చెందిన పదిహేనేళ్ల అమ్మాయి, దేశ్‌పాల్ ఒకరి మీద ఒకరు మనసు పారేసుకున్నారు. ఒకటిగా కలిసి ఉండాలని కలలు కన్నారు. పదిహేనేళ్లు అంటే దేశ్‌పాల్ మొదటి బిడ్డ ఏజ్ ఉండొచ్చు. మొత్తానికి ఇద్దరి మధ్య దాదాపు ముప్పైఏళ్ల తేడా. కాగా ఊరంతా ఛీ కొట్టినా సరే... ఇద్దరు మాత్రం పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించుకున్నారు. అది ఈ జన్మలో కాదని తెలిసి కలిసి చనిపోదామని డిసైడ్ అయ్యారు. భవాలి అండర్‌పాస్ సమీపంలో విషం తాగి.. స్పృహ కోల్పోయారు. వీరిని గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. మొత్తానికి ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... సమాజం ఎటు పోతుందోనని చర్చించుకుంటున్నారు. 15ఏళ్ల పిల్లను ట్రాప్ చేసినట్లు ఖచ్చితంగా అర్థమవుతుందని.. అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారని కొందరు అంటుంటే.. ఐదుగురు పిల్లల జీవితానికి ఎవరు బాధ్యత వహిస్తారని బూతులు తిడుతున్నారు మరికొందరు.






