- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీధి కుక్కల దాడిలో 32 గొర్రెలు మృతి
వీధి కుక్కల దాడిలో 32 గొర్రెలు మృతి చెందాయి. దీంతో రైతుకు తీవ్ర నష్టం జరిగింది.

దిశ, ములుగు : వీధి కుక్కల దాడిలో 32 గొర్రెలు మృతి చెందాయి. దీంతో రైతుకు తీవ్ర నష్టం జరిగింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని లక్ష్మక్కపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రవి ఆదివారం తన ఇంటి సమీపంలోని కొట్టంలో తన గొర్రెలను కట్టేసి వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో కుక్కలు గుంపులుగా వచ్చి గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో 32 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడగా.. మరో 6 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం కొట్టం వద్దకు చేరుకున్న రవి మృతి చెందిన గొర్రెలను చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. గాయపడిన గొర్రెలు కూడా బతికే అవకాశాలు లేవని వాపోయాడు. ఈ దాడితో సుమారు రూ.2.50 లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపాడు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరాడు.






