ఆ వీడియోలు చూసే వాళ్ళపై సైబర్ సెక్యురిటీ నజర్.. తెలంగాణలో 24మంది అరెస్ట్

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో పిల్ల‌ల అశ్లీల వీడియోలు చూసేవారికి పోలీసులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. 18 టీమ్స్‌తో క‌లిసి సైబ‌ర్ సెక్యురిటీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి 24మందిని అరెస్ట్ చేశారు.

ఆ వీడియోలు చూసే వాళ్ళపై సైబర్ సెక్యురిటీ నజర్.. తెలంగాణలో 24మంది అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పిల్ల‌ల అశ్లీల వీడియోలు చూసేవారికి పోలీసులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. 18 టీమ్స్‌తో క‌లిసి సైబ‌ర్ సెక్యురిటీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి 24మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇరిగేషన్ శాఖ అధికారి కూడా ఒకరు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అంతే కాకుండా నిందితులంతా మిడిల్ క్లాస్ వర్కింగ్ ఉద్యోగులేనని తెలిపారు. ఈ దాడుల్లో ఓ చిన్నారిని సైతం రక్షించినట్టు చెప్పారు. అరెస్ట్ అయినవారిలో గతంలోనూ ఇలాంటి నేరాలే చేసి ఇప్పటికే శిక్ష అనుభించినవాళ్లు కూడా ఉన్నట్టు తెలిపారు.

అయితే గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో పిల్లల అశ్లీల వీడియోలు చూడటం, షేర్ చేయడం 90శాతం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క ఏడాదిలోనే చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలు చూసిన నిందుతుల సంఖ్య పదింతలు పెరిగిందన్నారు. 2025లో పిల్లల అశ్లీల వీడియోలు చూసి షేర్ చేసిన కేసులు 875 నమోదవ్వగా 423 మందిని అరెస్ట్ చేశారు. అదే విధంగా 2024లో 37మంది అరెస్ట్ అయ్యారు. ఇలా ప్రతి ఏడాది సైబర్ సెక్యురిటీ అధికారులు పిల్లల అశ్లీల వీడియోలు చూసినా, షేర్ చేసినా నిఘా పెట్టి వారిని అరెస్ట్ చేస్తున్నారు.

Next Story