బాయ్స్ గెటప్‌లో వచ్చి సర్దేశారు.. బెంగళూరులో లేడీ దొంగల కిలాడీ వేషాలు!

by Ramesh Naini |

టన్నెరీ రోడ్డుకు చెందిన షాలు, నీలు అనే ఇద్దరు యువతులు సులభంగా డబ్బు సంపాదించాలని దొంగతనాల బాట పట్టారు. అయితే, పట్టుబడకుండా ఉండేందుకు వారు ఒక ప్లాన్ వేశారు.

బాయ్స్ గెటప్‌లో వచ్చి సర్దేశారు.. బెంగళూరులో లేడీ దొంగల కిలాడీ వేషాలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సినీ ఫక్కీలో వేషాలు మార్చి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువతులను బెంగళూరులోని సంపిగేహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్బాయిల మాదిరిగా దుస్తులు ధరించి, ఎవరికీ అనుమానం రాకుండా ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేస్తున్న వీరి అసలు రూపం చూసి పోలీసులే షాక్‌కు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని టన్నెరీ రోడ్డుకు చెందిన షాలు, నీలు అనే ఇద్దరు యువతులు సులభంగా డబ్బు సంపాదించాలని దొంగతనాల బాట పట్టారు. అయితే, పట్టుబడకుండా ఉండేందుకు వారు ఒక ప్లాన్ వేశారు.

బాయ్స్ గెటప్‌లో..

అబ్బాయిలలా జుట్టు కత్తిరించుకుని, ప్యాంటు, షర్టులు ధరించి 'బాయ్స్' గెటప్‌లో తిరుగుతూ రెక్కీ నిర్వహించేవారు. జనవరి 13న యలహంక సమీపంలోని అగ్రహార లేఅవుట్‌లో నివసించే సంగమేశ్ అనే ఆటో డ్రైవర్ కుటుంబం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళింది. ఇది గమనించిన ఈ కిలాడీ లేడీలు, పట్టపగలే తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లోని నగదు, విలువైన వస్తువులను దోచుకుని తమ స్కూటీపై పరారయ్యారు.

అసలు రంగు బయటపడింది!

బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సంపిగేహళ్లి పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. అందులో ఇద్దరు అబ్బాయిలు స్కూటీపై వచ్చి దొంగతనం చేసినట్లు స్పష్టంగా కనిపించింది. ఆ వాహనం నంబర్ ఆధారంగా నిందితులను వెంబడించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తీరా స్టేషన్‌కు తరలించి విచారించగా, వారు అబ్బాయిలు కాదని, యువతులని తేలడంతో పోలీసులు షాక్ అయ్యారు. వారి నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Next Story