అన్నను చంపాడు... గర్భిణీ అయిన వదినపై అత్యాచారం చేసి హత్య చేశాడు.. సంచలనంగా 15ఏళ్ల బాలుడి కేసు

by Sujitha Rachapalli |

గుజరాత్‌లో దారుణం చోటు చేసుకుంది. జూనాగఢ్ జిల్లా విశావదర్ తాలుకాలోని రిమోట్ గ్రామంలో అన్నను చంపిన తమ్ముడు.. ఆ తర్వాత వదినపై అత్యాచారం చేసి హత్య చేశాడు. బీహార్‌కు చెందిన పూజారి కుటుంబం 40ఏళ్ల క్రితం

అన్నను చంపాడు...  గర్భిణీ అయిన వదినపై అత్యాచారం చేసి హత్య చేశాడు.. సంచలనంగా  15ఏళ్ల బాలుడి కేసు
X

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్‌లో దారుణం చోటు చేసుకుంది. జూనాగఢ్ జిల్లా విశావదర్ తాలుకాలోని రిమోట్ గ్రామంలో అన్నను చంపిన తమ్ముడు.. ఆ తర్వాత వదినపై అత్యాచారం చేసి హత్య చేశాడు. బీహార్‌కు చెందిన పూజారి కుటుంబం 40ఏళ్ల క్రితం గుజరాత్‌కు వచ్చి స్థిరపడింది. కొవిడ్ సమయంలో పూజారి మరణించగా.. కుటుంబ బాధ్యతలను పెద్ద కొడుకు చూసుకుంటున్నాడు. ఆయన ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తుండగా.. 15ఏళ్ల తమ్ముడు పశువుల కాపరిగా ఉన్నాడు. అయితే అన్న తనను తరుచూ కొడుతున్నాడని, సంపాదించిన డబ్బును తీసుకుంటున్నాడని కక్ష పెంచుకున్నాడు తమ్ముడు. ఈ క్రమంలోనే అక్టోబర్ 16న అన్నను ఇనుప రాడ్‌తో కొట్టి చంపాడు. ఆ తర్వాత ఈ ఘటనను చూసిన ఆరు నెలల గర్భిణీగా ఉన్న వదిన ఊరిలో చెప్పేస్తుందేమోనని.. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశాడు. అత్యాచారం సమయంలో తల్లి ఉన్నా జోక్యం చేసుకోలేదు. ఆ తర్వాత తల్లి, చిన్న కొడుకు కలిసి దంపతుల మృతదేహాలను ఇంటి వెనుక గొయ్యి తీసి పాతిపెట్టారు. బట్టలను కాల్చి ఆధారాలు లేకుండా చేశారు. రక్తపు మరకలను శుభ్రం చేశారు.

అయితే దీపావళి సందర్భంగా వదిన తల్లి గారి కుటుంబం ఎన్ని సార్లు కాల్ చేసినా స్పందన లేకపోవంతో వాళ్లకు అనుమానం వచ్చింది.ఆమె తల్లిదండ్రులు అక్కడకు వెళ్లి అడగ్గా.. రోడ్డు ప్రమాదంలో మరణించారని చెప్పింది అత్త. ఆధారాలు అడిగితే చూపించలేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశావదర్ పోలీసులు అక్టోబర్ 31న బాలుడిని, అతని తల్లిని విడివిడిగా విచారించారు. ప్రశ్నల్లో బాలుడు పూర్తిగా నేరాన్ని ఒప్పుకుని, పూడ్చి పెట్టిన స్థలానికి పోలీసులను తీసుకెళ్లాడు. కాగా దీన్ని జువైనల్ కేసుగా పరిగణలోకి తీసుకున్నారు.

Next Story