15 ఏళ్ల కూతురిని హత్య చేసిన కన్న తల్లిదండ్రులు

by Sujitha Rachapalli |

* పదిహేను ఏళ్ల పాపను కిరాతకంగా చంపిన తల్లిదండ్రులు * ఎంత చెప్పినా వినడం లేదని దారుణమైన నిర్ణయం * సోషల్ మీడియాలో న్యూస్ వైరల్

15 ఏళ్ల కూతురిని హత్య చేసిన కన్న తల్లిదండ్రులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిదండ్రులే బిడ్డను దారుణంగా హతమార్చారు. ప్రయాగ్ రాజ్‌కు చెందిన రమేశ్ సోంకర్, సంతోష్ సోంకర్ దంపతులకు పదిహేను ఏళ్ల కూతురిని కిరాతకంగా చంపారు. ఆమె అబ్బాయిలతో మాట్లాడుతుందని.. తమ పరువు తీస్తుందని.. గొంతు పిసికి చంపేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తల్లి సంతోష్ పరారీలో ఉంది. కాగా విచారణలో ‘తను చాలా మంది అబ్బాయిలను మీట్ అవుతుంది.. మా పరువు పోతుంది.. ఇంకేం చేయమంటరు’ అని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పదిహేనేళ్ల పాపను ఎలా కంట్రోల్ చేయలేకపోయారు? సొంత బిడ్డను ఎలా చంపగలిగారు? ఈ కేసులో మరేదో నిజం దాగి ఉంది.. అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story