- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర ప్రమాదం.. రాతి గనిలో శిథిలాల కింద చిక్కుకున్న 15 మంది కార్మికులు
రాతి గనిలో కార్మికులు పనిచేస్తుండగా.. ఒక్కసారిగా గని కూలిపోయింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న 15 మంది కార్మికులు చిక్కుకుపోయారు.

దిశ, వెబ్ డెస్క్: రాతి గనిలో కార్మికులు పనిచేస్తుండగా.. ఒక్కసారిగా గని కూలిపోయింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న 15 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని సొనభద్ర జిల్లాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. బిల్లీ మార్కుండి మైనింగ్ ప్రాంతంలోని ఓబ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటన సంఘటన స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రెండు ప్రైవేటు కంపెనీల రక్షక బృందాలు, ఓబ్రా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
అదనపు యంత్రాలు, పరికరాలను హుటాహుటిన అక్కడకు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బద్రినాథ్ సింగ్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, కూలిన సమయంలో సైట్‌లో సుమారు డజను మంది పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను కనుగొనేందుకు విచారణ ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్మికుడు చిన్నూ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, అతని ఇద్దరు సోదరులు సంతోష్ యాదవ్, ఇంద్రజిత్ యాదవ్ కూడా శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని చెప్పారు. ప్రమాద సమయంలో తొమ్మిది కంప్రెసర్లు పనిచేస్తుండగా, ప్రతి కంప్రెసర్ వద్ద ఒక్కొక్కరు విధులు నిర్వహిస్తున్నట్టు మరో కార్మికుడు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






