- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్తీ మద్యం తాగి 15 మంది మృతి.. పలువురి పరిస్థితి అత్యంత విషమం
మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్, పుణె పరిసర ప్రాంతాల్లో విషపూరిత కల్తీ మద్యం తాగి 15 మంది మరణించారు.

దిశ, వెబ్‌డెస్క్: కల్తీ మద్యం (Adulterated Liquor) తాగి ఏకంగా 15 మంది దుర్మరణం పాలైన హృదయవిదారక ఘటన మహారాష్ట్ర (Maharashtra)లోని పింప్రి-చించ్వాడ్, పుణె జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకుంది. మరికొంతమంది ఆసుపత్రుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. పింప్రి-చించ్వాడ్ పరిధిలోని దాపోడి, ఫుగేవాడి ప్రాంతాల్లో అత్యధికంగా 8 మంది మరణించారు. అటు పుణె నగర పరిధిలోని కాలేపడల్ ప్రాంతంలో ముగ్గురు, హడప్సర్ ప్రాంతంలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందినట్లుగా తెలుస్తోంది.
ప్రధాన నిందితుడు అరెస్ట్..
ఆసుపత్రిలో చేరిన బాధితుల్లో చాలామంది తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్నారు. కొందరికి చూపు పూర్తిగా కోల్పోవడం (Vision Loss), తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు, ఆర్గన్ ఫెయిల్యూర్ (Organ Failure) కావడం వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తినట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో భాగంగా బాధితులు మద్యంలో మిథనాల్ (Methanol) సాధారణం కంటే ఎక్కువ మోతాదులో కలిపినట్లుగా గుర్తించారు. అయితే, ఈ కల్తీ మద్యాన్ని స్థానికంగా తయారు చేసి, సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు యోగేష్ వాంఖడేను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు.. రసాయనాలను ఎక్కడి నుంచి సరఫరా చేశారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.






