- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
14 ఏళ్ల మైనర్‌పై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. బాలిక కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసిన గ్రామస్థులు
ఉత్తరప్రదేశ్ బుదౌన్‌లో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు పక్కింటి వ్యక్తి. బాధితురాలు ప్రెగ్నెంట్ అని తేలడంతో ఈ విషయం బయటపడింది. దీంతో నిందితుడైన 40ఏళ్ల వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పంచాయితీ పెద్దలను

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బుదౌన్‌లో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు పక్కింటి వ్యక్తి. బాధితురాలు ప్రెగ్నెంట్ అని తేలడంతో ఈ విషయం బయటపడింది. దీంతో నిందితుడైన 40ఏళ్ల వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పంచాయితీ పెద్దలను ఆశ్రయించింది బాధిత కుటుంబం. దీనిపై పంచాయితీలో చర్చించిన పెద్దలు.. ఆమెకు అబార్షన్ చేయించాలని, అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.
14 ఏళ్ల బాలికతో 40 ఏళ్ల వ్యక్తి పెళ్లి ఏంటని ప్రశ్నించిన బాధిత కుటుంబం.. పంచాయితీ నిర్ణయాన్ని తప్పు పట్టింది. అలా చేయడానికి ఒప్పుకోమని స్పష్టం చేసింది. దీంతో పంచాయితీ ఆ కుటుంబాన్ని ఊరి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టారు.
Next Story






