ముగ్గురు మైనర్లచే అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక.. ఆత్మహత్య!

by Chintha Aamani |

ఉత్తర ప్రదేశ్ లో ఒక అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది.

ముగ్గురు మైనర్లచే అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక.. ఆత్మహత్య!
X

దిశ,వెబ్ డెస్క్ : బాలికపై మైనర్లు గ్యాంగ్‌రేప్ ‌కు పాల్పడిన అమానుష ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బులంద్‌షహర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖురజా ప్రాంతంలో 13 నుంచి 17 ఏళ్ల వయసు గల ముగ్గురు మైనర్లు 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జూన్ 28న ఓ బాలికతో పాటు మూడేళ్ల తమ్ముడిని బైక్ రైడ్ అని ఆ మైనర్లు తీసుకెళ్లారు. అనంతరం బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. దీంతో బాలిక ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని ఇంటి వచ్చి తల్లికి విషయం చెప్పింది. అనంతరం తల్లిదండ్రులు, గ్రామస్థులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మైనర్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. నిందితుల్లో ఒకరిని జువెనైల్ హోమ్‌కు పంపగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

ఇది ఇలా ఉండగా మంగళవారం ఉదయం తల్లి పని కోసం వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి గురైన బాలిక మానసిక ఒత్తిడితో ఉరేసుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి ఇంటికి వచ్చి చూడగా.. లోపల గడియ పెట్టి ఉండటంతో అనుమానం వచ్చి ఇంటి పైకప్పు ఎక్కి చూడగా.. కూతురు ఉరేసుకుని కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా సర్కిల్ ఆఫీసర్ పూర్ణిమ సింగ్ తెలిపారు.

Next Story