ఇంత ఘోరమా.. 14 నెలల పసికందు.. బయటకు తీసుకెళ్తానని చెప్పిన తాత.. అత్యాచారం.. ఆపై హత్య..

by Sujitha Rachapalli |

త్రిపురలో అత్యంత ఘోరం జరిగింది. పద్నాలుగు నెలల బాలికను బయటకు తీసుకెళ్తానని చెప్పిన తాత.. ఆమెపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేశాడు. ఇంటికి సమీపంలో ఉన్న గోడలో శవాన్ని దాచాడు. నార్త్ త్రిపుర జిల్లా పానిసాగర్ ఏరియాలో

ఇంత ఘోరమా.. 14 నెలల పసికందు.. బయటకు తీసుకెళ్తానని చెప్పిన తాత.. అత్యాచారం.. ఆపై హత్య..
X

దిశ, వెబ్ డెస్క్ : త్రిపురలో అత్యంత ఘోరం జరిగింది. పద్నాలుగు నెలల బాలికను బయటకు తీసుకెళ్తానని చెప్పిన తాత.. ఆమెపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేశాడు. ఇంటికి సమీపంలో ఉన్న గోడలో శవాన్ని దాచాడు. నార్త్ త్రిపుర జిల్లా పానిసాగర్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. పాపను తీసుకుని తల్లి.. తన పుట్టింటికి వచ్చింది. కానీ తాత చేసిన ఈ పాపంతో బాలిక చనిపోయింది. రాత్రి ఎనిమిది గంటల సమయంలో పాప కనిపించడం లేదని వెతికిన కుటుంబీకులు.. పోలీసులకు సమాచారం అందించారు. చుట్టుపక్కల వెతికిన పోలీసులు.. గోడలో పాప మృతదేహాన్ని గుర్తించారు. అయితే అప్పటికే నిందితుడు జయ్నల్ ఉద్దిన్ పారిపోయాడు. అస్సాం రాష్ట్రం శ్రీ భూమి జిల్లాలోని నిలంబజార్‌లో అతన్ని గుర్తించిన పోలీసులు.. అరెస్ట్ చేశారు. మరోవైపు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అత్యాచారం, హత్య నిర్ధారించబడితే కఠిన శిక్ష తప్పదు.

Next Story