- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నార్కట్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
by Malleboina Mahesh |
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద తెల్లవారుజామున ఘోర ప్రమాదం. అరుణాచలం నుండి హైదరాబాద్ వస్తున్న బస్సు డీసీఎంను ఢీకొట్టడంతో 13 మందికి తీవ్ర గాయాలు.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. డీసీఎం వాహనాన్ని ఢీ కొట్టడంతో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ షాకింగ్ ఘటన నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి వద్ద తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు అరుణాచలం నుంచి హైదరాబాద్ కు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుండగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 13 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






