- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలాపూర్ సలామి ఇండస్ట్రీస్ లో 1150 కిలోల మాంసం స్వాధీనం
అక్రమంగా నిల్వ ఉంచిన అపరిశుభ్రంగా ఉన్న 1150 కిలోల మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు.

దిశ,మీర్ పేట్ : అక్రమంగా నిల్వ ఉంచిన అపరిశుభ్రంగా ఉన్న 1150 కిలోల మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్‌లోని సలామి ఇండస్ట్రీస్ లో కోల్డ్ స్టోరేజ్ లో కొన్ని వారాల పాటు నిల్వ ఉంచి పలు హోటళ్ళు, రెస్టారెంట్లకు మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. 1150 కిలోల పరిశుభ్రత లేని మేక, గొర్రె మాంసం, తల మాంసం, బోటి నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించమన్నారు. సలామి కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకుడు అనుమతికి పరిమితికి మించి ఎక్కువ రోజులు నిల్వ చేసి, ప్రముఖ రెస్టారెంట్లకు హోల్ సేల్ గా విక్రయిస్తున్నారన్నారు.నిర్వాహకుడు సలాంమీ తోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నమనీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.






