- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో దారుణం.. కల్తీ కల్లుతాగి 11 మందికి అస్వస్థత
by Gantepaka Srikanth |
రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కూకట్‌పల్లి(Kukatpally)లోని హైదర్‌నగర్‌లో కల్తీ కల్లుతాగి(Unsafe alcohol) 11 మంది అస్వస్థతకు గురయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కూకట్‌పల్లి(Kukatpally)లోని హైదర్‌నగర్‌లో కల్తీ కల్లుతాగి(Unsafe alcohol) 11 మంది అస్వస్థతకు గురయ్యారు. విరేచనాలు, లోబీపీతో మంగళవారం ఆసుపత్రుల్లో చేరారు. వారిని పరీక్షించిన వైద్యులు కల్తీ కల్లే కారణమని నిర్ధారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతన్ని కూకట్‌పల్లిలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇచ్చారు. కాసేపట్లో జీహెచ్‌ఎంసీ అధికారులు ఆసుపత్రి వద్దకు రానున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






