స్కూల్ గ్రౌండులో కుప్పకూలి మరణించిన విద్యార్థి..షాకింగ్ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తోంది. ఒకప్పుడు కేవలం 50 ఏళ్లు పైబడిన వాళ్లే గుండెపోటుతో మరణించేవారు. కానీ ప్రస్తుతం ఉన్నట్టుండి కుప్పకూలుతూ వయసుతో సంబంధం లేకుండా మరణిస్తున్నారు.

స్కూల్ గ్రౌండులో కుప్పకూలి మరణించిన విద్యార్థి..షాకింగ్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తోంది. ఒకప్పుడు కేవలం 50 ఏళ్లు పైబడిన వాళ్లే గుండెపోటుతో మరణించేవారు. కానీ ప్రస్తుతం ఉన్నట్టుండి కుప్పకూలుతూ వయసుతో సంబంధం లేకుండా మరణిస్తున్నారు. ఈ ఆకస్మిక మరణాలకు కారణం కూడా వైద్యులు, సైంటిస్టులు ఇప్పటి వరకు గుర్తించలేదు. ఇదిలా ఉంటే తాజాగా హన్మకొండలో గేమ్స్ ఆడుతూ ఓ విద్యార్థి ఆకస్మాత్తుగా కిందపడి మరణించాడు.

నయీంనగర్‌లోని తేజస్వి స్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ లో పదవతరగతి చదువుతున్న జయంత్ వర్ధన్ అనే విద్యార్థి స్పోర్ట్స్ ఆడుతుండగా కిందపడ్డాడు. వెంటనే టీచర్లు పరిశీలించగా మరణించినట్టు గుర్తించారు. కాగా విద్యార్థి ముక్కు వద్ద రక్తం ఆనవాళ్లు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఇక ప్రస్తుతం విద్యార్థి అస్మాత్తుగా కిందపడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. VIDEO

Next Story