10 రోజులు.. 100 ఎఫ్ఐఆర్‌లు!

by Ajay Maddhiboyina |

సైబర్ నేరగాళ్ల చేతి లో మోసపోయిన బాధితులకు అండగా ఉండేందుకు హైదరాబా ద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల పోలీస్ కమిషనర్ సజ్జనా ర్ ప్రారంభించిన సీ-మిత్ర విభా గం సక్సెస్ అయ్యింది.

10 రోజులు.. 100 ఎఫ్ఐఆర్‌లు!
X

దిశ, సిటీక్రైం : సైబర్ నేరగాళ్ల చేతి లో మోసపోయిన బాధితులకు అండగా ఉండేందుకు హైదరాబా ద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రారంభించిన సీ-మిత్ర విభాగం సక్సెస్ అయ్యింది. ప్రారంభమైన 10 రోజుల్లోనే దాదాపు 100 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యే లా ఏఐ ద్వారా సీ-మిత్ర విభాగం పోలీసులు బాధితులకు సహాయం చేశారు. దాదాపు వెయ్యి మంది బాధితులతో ఫోన్ లో మాట్లాడి వారిలో ఉన్న భయం, ఆందోళన, కలవరాన్ని తొలగించి ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చేలా చేసి సీ-మిత్ర విభాగం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫి ర్యాదులో ఎలాంటి తప్పులు లే కుండా చేసి పోలీసులు బాధితుల కు వెంట ఉంటున్నారు.

ఇంటి నుంచి ఫిర్యాదు.. ఫోన్‌కు ఎఫ్ఐఆర్

హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎవరైనా సైబర్ మో సానికి గురైన వెంటనే ముందుగా 1930 లేదా సైబర్ క్రైం పోర్టల్ లో ఫిర్యాదు చేయాలి. అలా ఫిర్యా దు నమోదైన వివరాలను సీ-మిత్ర టీం పోలీసులు వాటిని గుర్తి స్తారు. ఆ ఫిర్యాదును డౌన్ లోడ్ చేసుకుని ఏఐ సహాకారంతో త ప్పులు లేకుండా తాజాగా ఫిర్యా దును సీ-మిత్ర తయారు చేస్తుం ది. ఆ తర్వాత బాధితుడికి ఫోన్ చేసి సీ-మిత్ర తయారు చేసిన ఫిర్యాదు కాపీని బాధితుడి ఫోన్ కు పంపిస్తుంది. బాధితుడి ఆ ఫి ర్యాదును మరోసారి సరి చూసు కుని దాని పై సంతకం చేసిన కాపీని తిరిగి సైబర్ క్రైం పోలీసు స్టేషన్ కు స్వయంగా వెళ్ళి ఇవ్వా లి. లేదా కొరియర్, పోస్టు ద్వారా కూడా పంపించే అవకాశాన్ని పో లీసులు కల్పించారు. ఇలా సంత కం చేసుకున్న కాపీని అందగానే సీ-మిత్ర టీం పోలీసులు దాని పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ వివరాలను బాధితులకు పంపిస్తారు. ఆ తర్వాత సంబంధిత అధికారి దర్యాప్తును ప్రారంభిస్తారు. ఇలా సీ-మిత్ర టీం బాధితుల ఫిర్యాదు ల్లో గందరగోళం లేకుండా అన్ని వివరాలు స్పష్టం గా ఉండేలా చేసి దర్యాప్తు వేగవంతంగా జరిగేలా తోడ్పడుతుంది. సీ-మిత్ర సేవల ను బాధితులు ప్రశంసిస్తున్నారు.

Next Story