- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబ్బులివ్వు.. లేకపోతే నెట్టింట నీ ఫొటోలు పెట్టేస్తా
<p>దిశ, వెబ్ డెస్క్: తన మాయమాటలతో ఆమెను బుట్టలో దింపేశాడు. ఆ తర్వాత ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేశారు. ఈ క్రమంలో వాళ్లిద్దరూ ఫొటోలు కూడా దిగారు. ఆ తర్వాత అతడి విషయం బయటపడింది. తనకు డబ్బులు కావాలంటూ ఆ ఫొటోలతో ఆ యువతిని వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని నరసరావుపేటలో శివానంద్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ […]</p>
దిశ, వెబ్ డెస్క్: తన మాయమాటలతో ఆమెను బుట్టలో దింపేశాడు. ఆ తర్వాత ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేశారు. ఈ క్రమంలో వాళ్లిద్దరూ ఫొటోలు కూడా దిగారు. ఆ తర్వాత అతడి విషయం బయటపడింది. తనకు డబ్బులు కావాలంటూ ఆ ఫొటోలతో ఆ యువతిని వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని నరసరావుపేటలో శివానంద్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతికి మాయ మాటలు చెప్పి ప్రేమలో పడేశాడు. ఆ తర్వాత వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేశారు. ఈ క్రమంలో సరదాగా ఫొటోలు దిగారు. అయితే ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, అలా చేయకూడదంటే తనకు డబ్బులివ్వాలని వేధించసాగాడు. దీంతో ఆ యువతి పులుమార్లు అతనికి డబ్బు అప్పజెప్పింది. అయినా కూడా అతను ఆ యువతి చేతికున్న బంగారు గాజులు ఇవ్వాలని వేధించాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే అతడికి రొంపిచర్ల, ఈపూరు పోలీస్ స్టేషన్లలో పనిచేసే కానిస్టేబుళ్లు సహకరించినట్లు సమాచారం.






