విరాట్ కోహ్లీ ‘లైక్’ కలకలం.. మౌనం వీడిన జర్మన్ బ్యూటీ లిజ్ లాజ్

by Ramesh Naini |   (  Updated:2026-04-18 12:32:36  IST  )

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో జర్మన్ ఇన్ఫ్లుయెన్సర్ లిజ్ లాజ్ పాత ఫోటోను లైక్ చేయడం నెట్టింట పెద్ద దుమారాన్ని రేపింది.

విరాట్ కోహ్లీ ‘లైక్’ కలకలం.. మౌనం వీడిన జర్మన్ బ్యూటీ లిజ్ లాజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్ లాజ్ పాత ఫోటోను లైక్ చేయడం నెట్టింట పెద్ద దుమారాన్ని రేపింది. కొద్దిసేపటికే ఆయన ఆ లైక్‌ను తొలగించినప్పటికీ (అన్‌లైక్), అప్పటికే స్క్రీన్‌షాట్లు వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఊహించని వివాదంపై సదరు జర్మన్ బ్యూటీ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది.

కోహ్లీని చూస్తే పాపం అనిపించింది..

కోహ్లీ తన ఫోటోను ఎప్పుడు లైక్ చేశాడో తనకు తెలియదని, ఉదయం నిద్రలేచి వార్తలు, నెటిజన్ల మెసేజ్‌లు చూశాకే ఈ విషయం తనకు అర్థమైందని లిజ్ లాజ్ పేర్కొంది. తన ఫోటోను లైక్ చేసినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ, ఈ చిన్న విషయం ఇంత పెద్ద వార్త కావడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేసింది. బహుశా అతడు ఉద్దేశపూర్వకంగా ఆ పని చేసి ఉండకపోవచ్చని, కోహ్లీ ఇబ్బంది పడటం చూసి తనకు బాధేసిందని చెప్పుకొచ్చింది.

క్రికెట్ పరిచయం.. ఆర్సీబీకి ఫ్యాన్

2025 లో తాను ఇండియాకు వచ్చినప్పుడు బెంగళూరులో ఐపీఎల్ చూశానని, అప్పటి నుంచే తాను క్రికెట్‌కు, ఆర్సీబీకి వీరాభిమానిగా మారానని వెల్లడించింది. ఆర్సీబీకి సపోర్ట్ చేస్తే కోహ్లీని ఇష్టపడకుండా ఉండలేమని ఆమె తెలిపింది. ఈ లైక్ పుణ్యమా అని రాత్రికి రాత్రే ఫేమస్ అయిన లిజ్ లాజ్‌కు ప్రస్తుతం ఇండియా నుంచి మ్యూజిక్, వ్లాగింగ్ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే మళ్లీ భారత్‌కు వస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.

గతంలోనూ ఇలాగే..

కాగా, 2025లో నటి అవనీత్ కౌర్ ఫోటోను కూడా కోహ్లీ ఇలాగే లైక్ చేసి వార్తల్లో నిలిచాడు. అప్పట్లో తన ఫీడ్ క్లీన్ చేస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ సాంకేతిక లోపం (అల్గారిథం) వల్ల పొరపాటున అలా జరిగిందని అతడు వివరణ ఇచ్చాడు. అయితే, తాజా జర్మన్ ఇన్ఫ్లుయెన్సర్ ఘటనపై విరాట్ కోహ్లీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

జిమ్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ బ్యూటీ

Next Story