- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఛాంపియన్ గా ఆర్సీబీ...ఆధ్యాత్మిక యాత్రలో ‘విరుష్క’
ఛాంపియన్ గా ఆర్సీబీ నిలిచిన తరుణంలో ఆధ్యాత్మిక యాత్రలో ‘విరుష్క’ మునిగారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ఛాంపియన్ గా RCB నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ ధామ్ ను సందర్శించిన విరుష్క జంట, అక్కడ ఆధ్యాత్మిక గురువు శ్రీ ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీస్సులు తీసుకుంది. ఐపీఎల్ ప్రారంభానికి అంటే ముందు ఇదే ప్రాంతానికి వచ్చిన విరుష్క జంట, ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా టోర్నమెంట్ ఫినిష్ చేసుకొని.. మళ్లీ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీళ్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఆధ్యాత్మిక పర్యటన అనంతరం, తిరిగి లండన్ వెళ్లనుంది విరుష్క జంట.
ఫైనల్ లో అద్భుతంగా రాణించిన కోహ్లీ
గుజరాత్, బెంగళూరు మధ్య ఐపీఎల్ ఫైనల్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. 75 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో వరుసగా రెండోసారి ఛాంపియన్ అయింది బెంగళూరు.






