- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Varun Chakaravarthy : కిరాణా షాపు నడిపిస్తోన్న వరల్డ్ కప్ హీరో !
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తాజాగా ఓ కిరాణా షాపు కూర్చుని అందరికీ షాక్ ఇచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ సాధించిన భారత జట్టులో వరుణ్ చక్రవర్తి ఉన్న సంగతి తెలిసిందే. మిస్టరీ స్పిన్నర్ గా భారత జట్టుకు సెలెక్ట్ అయిన వరుణ్ చక్రవర్తి, టీ20 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించాడు. ఇండియాకు వరల్డ్ కప్ తేవడంలో తన వంతు కృషి చేశాడు. ఇక టైటిల్ గెలిచిన తర్వాత తన సొంతూరు చెన్నైకి వెళ్ళిపోయాడు వరుణ్ చక్రవర్తి. ఈ సందర్భంగా ఓ కిరాణా కొట్టులో కూర్చొని అందరికీ షాక్ ఇచ్చాడు.
కిరాణా దుకాణంలో వరుణ్ చక్రవర్తి
బీదర్ లో పుట్టి పెరిగిన వరుణ్ చక్రవర్తి, చెన్నైలో సెటిల్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆర్కిటెక్ట్ చదివిన వరుణ్ చక్రవర్తి ఆ తర్వాత క్రికెట్ వైపు అడుగులు వేశాడు. ఈ తరుణంలోనే ఐపిఎల్ టోర్నమెంట్ లో రాణించి.. భారత జట్టులోకి ప్రవేశించాడు. అందరూ స్పిన్నర్ల కంటే వరుణ్ చక్రవర్తి చాలా భిన్నం. అతని బౌలింగ్ అర్థం చేసుకోవాలంటే, సాధన చేయాల్సిందే. అందుకే భారత జట్టులో అతనికి సముచిత అవకాశం వస్తుంది. కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్స్ ను పక్కకు పెట్టి మరి, వరుణ్ చక్రవర్తికి అవకాశాలు ఇస్తున్నారు.
అయితే మొన్న వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్రస్తుతం తన సొంతూరులోనే ఉంటున్నాడు వరుణ్. ఈ సందర్భంగా ఓ కిరాణా కొట్టులో దర్శనమిచ్చాడు. దీంతో వరల్డ్ కప్ హీరో కిరాణా కొట్టు నడిపిస్తున్నాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే వరుణ్ చక్రవర్తికి సంబంధించిన సన్నిహితులదే ఆ దుకాణం. చిన్నప్పటి నుంచి అక్కడే తిరిగేవాడు వరుణ్ చక్రవర్తి. అయితే సక్సెస్ అయి ఉన్నత స్థాయికి వెళ్లిన తర్వాత కూడా తన మూలాలను మర్చిపోకుండా సింప్లిసిటీని ప్రదర్శించాడు. ఎప్పటిలాగానే, ఆ కిరాణా షాప్ లో కూర్చుని అందరినీ ఆకట్టుకున్నాడు.






