IND vs PAK : టీమిండియా శివతాండవం..! అభిమానుల సంబురాలు

by Ramesh Naini |

టీ20 వరల్డ్ కప్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

IND vs PAK : టీమిండియా శివతాండవం..! అభిమానుల సంబురాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీ20 వరల్డ్ కప్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన హై-వోల్టేజ్ పోరులో టీమిండియా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రదర్శన కనబర్చి పాక్‌ను 61 పరుగుల భారీ తేడాతో మట్టి కరిపించింది. ఈ విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో పాక్ ముందు 176 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, 176 పరుగుల ఛేదనలో పాక్ బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి విలవిలలాడారు. ఆరంభం నుంచే తడబడిన పాకిస్తాన్, ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. చివరికి 18 ఓవర్లలో కేవలం 114 పరుగులకే పాక్ చిత్తు అయింది.

అభిమానులకు 'శివరాత్రి' కానుక

ఈ అద్భుత విజయం మహా శివరాత్రి రోజే దక్కడంతో అభిమానుల ఆనందం రెట్టింపైంది. ‘శివరాత్రి పర్వదినాన టీమిండియా ప్లేయర్లు మాకు వెలకట్టలేని కానుక ఇచ్చారు’ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మైదానంలో టీమిండియా శివతాండవం చేసిందని, దాయాదిని చిత్తుగా ఓడించి అసలైన పండుగ తెచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు. టీమ్ ఇండియా సాధించిన ఈ ఘన విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు సోషల్ మీడియా వేదికగా టీమిండియాను అభినందిస్తున్నారు.

Next Story