India vs Pakistan : ఈ సారి కూడా నో షేక్‌హ్యాండ్!

by Ramesh Naini |

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్-పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ సారథి సల్మాన్ అలీ ఆఘా షేక్‌హ్యాండ్ (Handshake) చేసుకోలేదు.

India vs Pakistan : ఈ సారి కూడా నో షేక్‌హ్యాండ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: (T20 World Cup) టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్-పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ సారథి సల్మాన్ అలీ ఆఘా షేక్‌హ్యాండ్ (Handshake) చేసుకోలేదు. టాస్ ముగిసిన తర్వాత ఇద్దరు కెప్టెన్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోకుండానే వెనుదిరిగారు.

కొనసాగుతున్న ప్రోటోకాల్!

2025లో దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ నుంచి భారత్ 'నో షేక్‌హ్యాండ్' విధానాన్ని కఠినంగా అమలు చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' నేపథ్యంలో దాయాది దేశంతో క్రీడా పరమైన సంబంధాల్లో భారత్ ఈ కఠిన వైఖరిని అవలంబిస్తోంది. పురుషుల జట్టుతో పాటు మహిళల మరియు అండర్-19 జట్లు కూడా పాకిస్తాన్‌తో తలపడేటప్పుడు ఇదే ప్రోటోకాల్‌ను పాటించిన విషయం తెలిసిందే.

తుది జట్టులో మార్పులు..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగుతున్న భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. కొలంబోలో ఆకాశం మేఘావృతమై ఉండటంతో, పిచ్ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని భారత బ్యాటర్లను కట్టడి చేయాలని పాక్ భావిస్తోంది. ప్రస్తుతం రెండు జట్ల ఆటగాళ్లు జాతీయ గీతాల ఆలాపన ముగించుకుని మైదానంలోకి అడుగుపెట్టారు.

Next Story